రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని కర్నూలు ఏడీఏ సాలురెడ్డి సూచించారు. శుక్రవారం గూడూరులో ఏవో శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ పంటలపై రైతులకు పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడీఏ సాలురెడ్డి హాజరై, పొలంబడి ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించి, మాట్లాడారు. పొలంబడి ద్వారా ఏయే పంటలు సాగు చేసుకోవచ్చని తెలియజేశారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలన్నారు.