ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. గురువారం వారు గూడూరు మండలం చనుగొండ్లలో మాట్లాడారు. నిరుపేదలకు రూ. 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ఈనెల 10వ గూడూరు తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. కృష్ణ, ధోని శేషుకుమార్ పాల్గొన్నారు.