కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులతో మాట్లాడి, వారికి అందాల్సిన మందులు, వారికి మంచి వైద్యం అందుతుందో, లేదో అని రోగులతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. రోగులకు ధైర్యంగా ఉండాలని, ధైర్యంగా ఉంటేనే వైద్యం నుంచి బయటపడతారని భరోసా ఇచ్చారు. వివిధ రకాల చికిత్సల కోసం వచ్చే వారికి నాణ్యమైన వైద్య అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.