కోడుమూరు: మంత్రి లోకేష్ చొరవతో పథకం తిరిగి ప్రారంభం

74చూసినవారు
కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులతో మత్తుపదార్థాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన ఆయన అనంతరం మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఆమోదించిన మధ్యాహ్న భోజన పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసినట్లు విమర్శించారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో పథకం తిరిగి ప్రారంభించారన్నారు. ఎంపీడీవో రాముడు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్