కోడుమూరు మండలంలోని వర్కూరు సుద్ధవాగు నుంచి హంద్రీనదికి తాగునీరు విడుదల చేయించిన టీడీపీ సీనియర్ నాయకుడు విష్ణువర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గులు దస్తగిరిలకు శుక్రవారం వర్కూరు టీడీపీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు రాముడు, క్రిష్ణ మాట్లాడారు. గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. సమస్యను తెలిపిన వెంటనే స్పందించి జీడీపీ కెనాల్ ద్వారా విడుదల చేయించారన్నారు.