గూడూరు పట్టణంలో కర్నూలు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. మచ్చలేని నాయకుడిగా, ఆదర్శవంతంగా పాలన అందిన నాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు రాజారెడ్డి, చెట్టుకింది సురేష్, సంగాల మధు, నాగరాజు, చెట్టుకింది నారాయణ పాల్గొన్నారు.