రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వెంటనే 30శాతం ఫిట్మెంట్ తో 12వ వేతన సవరణ అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోడుమూరులో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ తాలుకాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ డీఏ మంజూరు చేయడంతో పాటు, జీవో నంబర్ 117 రద్దు చేయాలన్నారు.