కర్నూలు నగరంలోని ప్రజా పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ ఎస్. రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ 24 అర్జీలు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కమిషనర్ కృష్ణ, మెడికల్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు.