కర్నూలు నగరంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం నిర్వహించే కెసి కెనాల్ వినాయక ఘాట్‌ను గురువారం కమిషనర్ రామలింగేశ్వర్ అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయక నిమజ్జన ఘాట్ వద్ద ప్రారంభమైన పిచ్చి మొక్కల తొలగింపు, పరిశుభ్రత వంటి పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. నిమజ్జనానికి సంబంధించి నగర పాలక చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు.