కర్నూలులో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలులో ఏపీ, తెలంగాణ సీబీఎస్ఈ క్లస్టర్ సెవెన్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంటు క్వార్టర్ ఫైనల్ పోటీలకు హాజరై మాట్లాడారు. విద్యార్థులను పరిచయం చేసుకుని ఫుట్‌బాల్ ఆడారు. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, దిగ్గజ క్రీడాకారులు మెస్సీ, రోనాల్డోను ఆదర్శంగా తీసుకొని ప్రతిభ చాటలన్నారు.