కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే వరప్రదాయిని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. శుక్రవారం 10, 676 క్యూసెక్కుల నీరు చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 101. 773 టీఎంసీల నిల్వ ఉందన్నారు. వివిధ కాల్వలకు 10, 021 క్యూసెక్కల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని వివరించారు.