మంత్రాలయం పుణ్యక్షేత్రంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రముఖ టాటా కంపెనీ ముందుకు వచ్చింది. శనివారం టాటా కంపెనీ అధికార ప్రతినిధి చంద్రశేఖర్, ప్రణాళిక ఇంజనీర్ రంగనాథ్ ఆధ్వర్యంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు భూమిపూజ చేసి, మాట్లాడారు. శ్రీమఠంతో పాటు మంత్రాలయంలో ప్రధాన కాలనీలను కలుపుతూ దాదాపు 2 కి. మీల మేర రూ. 13 కోట్లతో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు టాటా కంపెనీ ఉచితంగా చేపట్టిందన్నారు.