మంత్రాలయం: మేకడోణ కొండల్లో చిరుత పులి సంచారం

65చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని మేకడొణ గ్రామంలో గల కత్తుల కొండపై చిరుత సంచారం అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం చిరుత సంచారాన్ని ఓ రైతు గుర్తించారు. ఈ చిరుత పులి సుమారు పది రోజులకు పైగా కొండల సమీపంలో సంచరిస్తున్న సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి చిరుత పులిని బంధించి తమ ప్రాణాలను కాపాడాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్