మంత్రాలయం: రంగన్న మృతి టీడీపీ పార్టీకి తీరని లోటు

52చూసినవారు
మంత్రాలయం: రంగన్న మృతి టీడీపీ పార్టీకి తీరని లోటు
మంత్రాలయం నియోజకవర్గం కోసిగి పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకుడు నాడిగేని రంగన్న శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి కోసిగికి చేరుకుని ఆయన మృతికి సంతాపం తెలిపారు. రంగన్న మృతి టీడీపీ పార్టీకి తీరని లోటని, మంచి నాయకున్ని కోల్పోయిన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రంగన్న పాడే మోసి కన్నీటి వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్