పెద్దకడబూరు మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం ముందు కల్వర్టు, బనవాసి రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. దాదాపు రూ.2.55 లక్షల ఎంపీపీ, సర్పంచ్ నిధులతో పనుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్ల సమస్య నేడు పరిష్కారం కావడంతో ఎస్సీ కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.