పెద్దకడబూరు మండల పరిధిలోని హనుమాపురం వద్ద జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. గడచిన ఏడాదిలోనే దాదాపు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. రహదారికి ఆనుకొని ఊరు ఉండటం కనీసం ప్రమాద సూచికలు లేకపోవడంతో వాహనదారుల వేగానికి అదుపు లేకుండా పోతోంది. సంబంధిత అధికారులు వేగ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.