పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచార ఘటన బాధాకరమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ నేత కాశీం వలి, తెలిపారు. శుక్రవారం ఎమ్మిగనూరులో గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. డాక్టర్స్ కే రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు.