రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాణ్యంలో ప్రజాసంఘాలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. శనివారం పాణ్యంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.