పాణ్యం: సీఐ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం

68చూసినవారు
పాణ్యం: సీఐ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినాన్ని కల్లూరు మండలం దూపాడు గ్రామం ప్రాథమిక పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐ మధుసూదన్ గౌడ్ పాఠశాల విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. సీఐ మాట్లాడారు. రేపటి సమాజంలో బాలల యొక్క ప్రాముఖ్యత, వారు దేశానికి అందించవలసిన సేవలు వంటి తదితర అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్