కల్లూరు మండలం దూపాడు గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం అహోబిలం కొండపై నుంచి జారిపడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దూపాడు కు చెందిన నాగరాజు (40) అనే వ్యక్తి ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలోని నల్లమల అడవిలో వెళ్తూ కాలు జారి పడిపోవడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు. భార్య మహాలక్ష్మి, ముగ్గురు సంతానం ఉన్నారు.