డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమానికి స్పందన వచ్చిందని పత్తికొండ ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీక్ తెలిపారు. మంగళవారం పత్తికొండలో నిర్వహించిన డీవైడీఎంకు ప్రయాణికుల నుంచి 23 విజ్ఞప్తులు వచ్చినట్లు చెప్పారు. గుంతకల్లు నుంచి తుగ్గలి మీదుగా కర్నూలుకు బస్సు నడపాలని, పత్తికొండ-గుత్తికి ఆర్డీనరీ సర్వీసులు కావాలని, అదే విధంగా ఆలూరుకు సమయానుకూలంగా బస్సులు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారన్నారు.