కర్నూలు జిల్లాలోని మద్యం దుకాణాల కోసం స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో 100 శాతం పారదర్శకతను పాటిస్తున్నామని జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం షాపులకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఏ షాపుకు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయో యాప్ ద్వారా ప్రతిపౌరుడు తెలుసుకోవచ్చన్నారు. అప్లికేషన్ల సంఖ్య బాగా పెరిగిందని, బుధవారం గడువు ముగుస్తుందని తెలిపారు.