నకరికల్లు: ముగిసిన ఆధార్ ఉచిత సవరణ సేవలు
నకరికల్లు స్ధానిక సచివాలయం నందు ఉచితఆధార్ సవరణ సేవలు ముగిసినట్లు పంచాయితి కార్యదర్శి కె. శివప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ 108 మంది ఆధార్ సేవలు వినియోగించుకున్నట్లు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా 108 మందికి ఆధార్ అప్డేషన్ చేయటం జరిగిందన్నారు. ఈ కేంద్రంలో54 మందికి 5 నుంచి 7 సంవత్సరాలు, మరియు 15 నుంచి 17 సంవత్సరాలు వారికి బయోమెట్రిక్ అప్డేషన్ ఉచితంగా ఈ ఆధార్ కేంద్రం నందు చేయడం జరిగిందని చెప్పారు.