శ్రీశైలం లో వైభవంగా స్వర్ణరథోత్సవం

60చూసినవారు
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం బుధవారం నిర్వహించారు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు ఈ స్వర్ణరథాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. దేవస్థానం ఇంచార్జి కార్యనిర్వహణాధికారి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్