కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలానికి భారీగా నీరు విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 1, 14, 645 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యామ్లో 822. 5 అడుగులు, 42. 7386 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి.