కృష్ణానది పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాము వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 1, 14, 672 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో నీటిమట్టం 823. 70 అడుగులుగా, నీటి నిల్వ సామర్థ్యం 43. 7515 టీఎంసీలుగా నమోదైంది. మరో 2 రోజుల్లో వరద ఉధృతి పెరగనున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.