కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై మంగళవారం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కళ్యాణీ విచారణ చేపట్టారు. కళాశాలను సందర్శించిన ఆమె, విద్యార్థులతో సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎస్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేశామని, విద్యార్థుల సమస్యలను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్, సీఎస్ కు అందజేస్తామన్నారు.