ఎమ్మిగనూరు: కారు అదుపు తప్పి బోల్తా.. ఐదుగురికి గాయాలు

83చూసినవారు
ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగారెడ్డి కుటుంబ సభ్యులు మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామిని దర్శించుకుని, యాగంటికి వెళ్తుండగా కారు అదుపుతప్పి పల్టీ కొట్టి ఎల్లెల్సీ కాల్వపై ఎక్కింది. దీంతో 5 మందికి స్వల్ప గాయాలు కాగా, ఒకరికి తీవ్రగాయలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్