ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం పోలీసులు నాగలదిన్నె గ్రామ శివారులో కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఐ మధుసూదన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 8 బాక్సుల కర్ణాటక మద్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. మద్యంతో పాటుగా ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.