ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. శనివారం విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంకల్పాలను నెరవేర్చుకుంటూ, పేదల ఆకలి తీర్చడానికి ఈ పథకం ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.