నెల్లిమర్ల జనసేన అభ్యర్థి బాగా రిచ్.. ఆస్తుల వివరాలు

51చూసినవారు
నెల్లిమర్ల జనసేన అభ్యర్థి బాగా రిచ్.. ఆస్తుల వివరాలు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894.92 కోట్లుగా పేర్కొన్నారు. మాధవికి చరాస్తులు రూ.856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు. అప్పులు రూ.2.69 కోట్లు ఉన్నాయి. బ్యాంకు అకౌంట్‌లో రూ.4.42 కోట్లు, నగదు రూపంలో రూ.1.15 లక్షలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆమెకు మిరాకిల్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్‌ వంటివి ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్