ఎమ్మెల్యే రేసులో ప్రముఖ నటి

88376చూసినవారు
ఎమ్మెల్యే రేసులో ప్రముఖ నటి
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలను బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీ అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఇందులో ఒడిశా సినీ నటి 'వర్ష ప్రియదర్శిని' పేరు కూడా ఉంది. రెండు రోజుల క్రితం బీజేడీలో చేరిన నటి వర్షకు పార్టీ జాజ్‌పూర్ జిల్లాలోని బర్చానా అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ ఇచ్చారు. నటి వర్ష ప్రియదర్శిని సిట్టింగ్ ఎమ్మెల్యే అమరప్రసాద్ సత్పతి స్థానంలో పోటీ చేయనుంది.

సంబంధిత పోస్ట్