జగన్ వద్ద రూ.82 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల

1567చూసినవారు
జగన్ వద్ద రూ.82 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ వద్ద రూ.82.58 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే తన వదిన వైఎస్ భారతి వద్ద రూ.19.56 లక్షలు అప్పు చేశారు. షర్మిలకు చరాస్తులు రూ.123.26 కోట్లు, స్థిరాస్తులు రూ.9.29 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. షర్మిల మొత్తం ఆస్తులు రూ.182.82 కోట్లు ఉంటాయని తెలిపారు. షర్మిలకు ఏడాదికి ఆదాయం రూ.97,14,213 వస్తుందని అఫిడవిట్‌లో తెలిపారు.

సంబంధిత పోస్ట్