పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 76 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నాయి. అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 9. 860 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి 55 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తున్నాయి.