ఏఎస్ పేట: ప్రజలకు తప్పని తిప్పలు

76చూసినవారు
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట బస్టాండ్ సెంటర్ వద్ద ఆదివారం, సోమవారం మళ్ళీ పడిన వర్షానికి నీళ్లు నిలపడ్డాయి. దీంతో ఆత్మకూరు కి వెళ్లే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మూడు అడుగుల లోతులో వర్షపు నీరు నిలవడంతో స్థానిక అధికారులు, నాయకులు స్పందించి తాత్కాలికంగా జెసిబి తో వర్షం నీరు వెళ్లేందుకు కాలువ తీయించారు. అయినప్పటికీ మళ్ళీ నీరు నిలబడింది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్