ఆత్మకూరు పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి రామ్ డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు ఫ్రెషర్స్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె ఎన్ రాజు హాజరయ్యారు. ఆయన కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలికి వారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కళాశాలలోని సీనియర్ విద్యార్థులు జూనియర్ ల పట్ల స్నేహ భావాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని కలిగి ఉండాలని తెలిపారు. సీనియర్ విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు చదువుకు సంబంధించిన విషయాల పట్ల ఆదర్శంగా ఉండాలని, అదే విధంగా దిశానిర్దేశం చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు కొన్ని సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన రావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.