TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన రెడ్డబోయిన సుమంత్(36) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆటో కిరాయిలు లేకపోవడంతో నెలవారీ కిస్తీలు చెల్లించలేకపోయాడు. దీంతో సుమారు రూ.5 లక్షల వరకు అప్పు చేసినట్లు సమాచారం. అప్పులు కట్టలేక మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.