సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడి ప్రధాన ఉద్దేశం దొంగతనం చేయడమని, దాడి చేయడం కాదని పేర్కొన్నారు. అలాగే అతను దొంగతనం చేయడానికి వచ్చిన ఇళ్లు సైఫ్ అలీఖాన్ ది అని అతడికి తెలియదని స్పష్టం చేశారు.