క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ

68చూసినవారు
క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి లీగుల్లో అతడు బౌలింగ్‌ చేయకుండా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌ న్యాయస్థానం షకీబ్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఐఎఫ్‌ఐసీ బ్యాంకుకు సంబంధించి మూడు లక్షల డాలర్ల చెక్‌ బౌన్స్‌ కేసులో ఈ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్