నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టిఎంసిలు. కాగా సోమవారం ఉదయం 6 గంటల సమయానికి జలాశయంలో 54. 162 టీఎంసీల నిరు నిల్వ ఉన్నట్లు జలాశయం అధికారి దశరథ రామ రెడ్డి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 7. 197 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. పెన్నా డెల్టాకు 1000, కండలేరుకు 10, 000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 290 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.