ఆత్మకూరు మున్సిపాలిటీ టిడిపి నాయకులతో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి తనతోనే సాధ్యమన్నారు. ఇకపై ఆత్మకురు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు.