దాతృత్వం చాటుకున్న ఐక్య ఫౌండేషన్

2159చూసినవారు
దాతృత్వం చాటుకున్న ఐక్య ఫౌండేషన్
ఆత్మకూరు పట్టణంలోని ఓందురుగుంట ప్రాంతానికి చెందిన దెయ్యాల శేఖర్ - అలివేలమ్మ ముగ్గురు పిల్లలు జీవనం సాగిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం అలివేలమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేక మృతి చెందింది. ప్రస్తుతం ఆ చిన్నారులకు ఆలనాపాలనా లేక తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్న విషయాన్ని స్థానిక ఐక్య ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరికి తెలియజేయగా ఆ కుటుంబ పరిస్థితిని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ ప్రణీత్ చౌదరి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఈరోజు ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడే నాణ్యమైన బియ్యం బస్తాలు, వంట సామాగ్రి, తినుబండారాలు, పండ్లు డాక్టర్ ప్రణీత్ చౌదరి గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ తమ కుటుంబ పరిస్థితిని ఐక్య ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్నామని ఈ చిన్నారులకు అతి చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడం చాలా బాధ వేసిందని ఈ కుటుంబానికి తమ వంతుగా సహాయం అందజేస్తామని ఆయన అన్నారు. అనంతరం రామకృష్ణచౌదరి మాట్లాడుతూ ఆర్థికంగా ఆపదలో ఉన్న వారి కుటుంబాల పరిస్థితిని డాక్టర్ ప్రణీత్ చౌదరి గారి దృష్టికి తీసుకెళ్లితే తమ వంతుగా సహాయ సహకారాలు అందించి కుటుంబాలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడని ఐక్య ఫౌండేషన్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ ప్రణీత్ చౌదరి, ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి, డాక్టర్ కుమార్, ఐక్య ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతినాయుడు, నిజాముద్దీన్, షరీఫ్, యాసీన్, జశ్వంత్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్