నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామంలో దళితులకు స్మశానం కోసం భూమి కేటాయించాలని సిపిఎం గుడ్లూరు ఏరియా కార్యదర్శి జివి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసిల్దార్ స్వర్ణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు మంగళవారం సిపిఎం నాయకులు వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వాలు మారినప్పటికీ దళితులకు కనీసం స్మశాన స్థలం కేటాయించకపోవడం దారుణం అన్నారు. అధికారులు వెంటనే ఈ విషయంపై స్పందించి న్యాయం చేయాలని కోరారు.