కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు వివిధ రకాల సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అర్జీలు అన్నిటినీ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.