నెల్లూరు జిల్లా ఉలవపాడు జీవీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం రాష్ట్రీయ ఏకత దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. ఆనాడు వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేసి దేశ సమైక్యతకు దోహదపడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను అందరూ ఆదర్శప్రాయంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.