పాకల సముద్రంలో కందుకూరు కు చెందిన వ్యక్తి మృతదేహం

81చూసినవారు
పాకల సముద్రంలో కందుకూరు కు చెందిన వ్యక్తి మృతదేహం
సింగరాయకొండ మండల పరిధిలోని పాకల గ్రామంలో గల సముద్రంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పాకల గ్రామస్తులు సముద్రంలో మునికి తేలుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న సింగరాయకొండ పోలీసులు సముద్రంలో తేలుతున్న మృతదేహాన్ని బయటకు తీశారు. కందుకూరుకు చెందిన కొత్తూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్