కావలి మండల పరిధిలోని రుద్రకోట సమీపంలో ఉన్న తారు మిక్సింగ్ ప్లాంట్ లో 20 డబ్బాలు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని వాచ్ మెన్ ప్లాంట్ యజమాని దశరధ రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దశరథ రామిరెడ్డి గురువారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా కందుకూరు, కొండేపి మండలాల్లో రోడ్డులు వేయడానికి తారు డబ్బాలు ఉపయోగిస్తున్నారు. చోరీ చేసిన వారిని వెంటనే గుర్తించి తారుడబ్బాలను అప్పగించాలని పోలీసులను ఆయన కోరారు.