కొడవలూరు: ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహణ

52చూసినవారు
కొడవలూరు: ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహణ
కొడవలూరు మండలంలోని రామన్నపాలెంలో సోమవారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇంటివద్ద బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి బాలచంద్రబాబు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్