రంజాన్ వేడుకల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

613చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మజీత్ ఏ హబీబ్ మసీదులో గురువారం రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఆమె రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, టిడిపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్