ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి కోవూరులో కైలాస భూమిగా పిలుచుకునే స్మశాన వాటికలో అభివృద్ధి పనులకు మంగళవారం శంఖుస్థాపన చేశారు. బండి సుధాకర్ రెడ్డి నిర్మించిన మృతదేహాలను ఉంచేందుకు నిర్మించిన భవనం, దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మృత్యుంజయ స్థూపంతో పాటు స్మశాన వాటికలోని సత్య హరిశ్ఛంద్ర విగ్రహాన్నివేమిరెడ్డి దంపతులు ప్రారంభోత్సవం చేశారు.